హైదరాబాద్ డిసెంబర్ 31చాటింపు ప్రతినిధి:
రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఎఎస్ అధికారి సోమేశ్ కుమార్ ను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులపై ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం సంతకం చేశారు. 2020 జనవరి 1 నుంచి 2023 డిసెంబర్ 31 వరకు సోమేశ్ కుమార్ ఈ బాధ్యతలు నిర్వర్తిస్తారు. ఎక్కువ సమయం ఈ బాధ్యతలు నిర్వహించే అవకాశం రావడం వల్ల సోమేశ్ కుమార్ ను నియమించడం వల్ల స్థిరత్వం ఉంటుందని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.